
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న మహేష్, తన నెక్ట్స్ చిత్రాన్ని అనౌన్స్ అయితే చేశాడు కానీ ఇంకా పట్టాలెక్కించలేదు. కాగా కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందనేది వాస్తవం.
కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో ఎవ్వరూ ఊహించని విధంగా ఓ ట్విస్టును చూపెడుతున్నాడట పరశురామ్. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు షేడ్స్‌లో మనకు కనిపిస్తాడట. ఈ పాత్రలో మహేష్ నటన పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో ఉండబోయే ట్విస్టు ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఉంటాయని తెలుస్తోంది.
బ్యాంక్ మోసాల నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. నవంబర్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.