Home Latest News మోషన్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్

మోషన్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్

sarkaru vari pata thumb 1

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను గీతాగోవిందం వంటి బ్లాక్‌బస్టర్ అందించిన పరశురామ్ డైరెక్షన్‌లో వస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి కేవలం అనౌన్స్‌మెంట్ మాత్రమే ఇప్పటివరకు రావడం, ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.

అయితే నేడు(ఆగస్టు 9) మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్ రూపాయి నాణేన్ని ఎగరేస్తూ కనిపించాడు. కానీ మహేష్ లుక్‌ను మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. దీంతో ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందా అనే అంశం ఇంకా సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అయితే ఈ మోషన్ పోస్టర్‌లో సినిమా బ్యాక్‌డ్రాప్ ఏమిటో చేప్పేశారు. ఈ సినిమా పూర్తిగా ఆర్థిక నేరాల చుట్టూ తిరిగే కథ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ మోషన్ పోస్టర్‌కు థమన్ అందించిన సంగీతం పీక్స్‌లో ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీన్ని తెగ షేర్‌లు చేస్తున్నారు.

పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా పట్టాలెక్కించాలని, అటుపై వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Sarkaru Vaari Paata Motion Poster | Mahesh Babu | Parasuram Petla | Thaman S
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad