Home సినిమా బాలీవుడ్ న్యూస్ ప్రమాదంలో సంజయ్ దత్ ! ఆ వ్యాధి సోకిందా ?

ప్రమాదంలో సంజయ్ దత్ ! ఆ వ్యాధి సోకిందా ?

sanjay-dutt

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో సంజయ్ దత్ ఒకరు. అతి తక్కువ సమయంలోనే భారీ విజయాలు అందుకున్న ఈ నటుడు ప్రస్తుతం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత శనివారం సంజయ్‌ దత్‌ తీవ్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. మొదట్లో కరోనా సోకిందని అందరూ అనుకున్నప్పటికీ వైద్యులు అటువంటిదేమీ లేదని ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కరోనా టెస్ట్ సమయంలో ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు కూడా చేసినట్టు తెలుస్తోంది.

ఈ పరీక్షల్లో సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. అది కూడా స్టేజ్ 3లో ఉందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం సంజయ్ దత్ వయసు 61 సంవత్సరాలు. ఈ వ్యాధి కారణంగానే సంజయ్ దత్ తీవ్ర శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులే బాలీవుడ్ హంగామా ఛానెల్‌కు చెప్పారు. క్యాన్సర్ మూడో స్టేజ్ లో ఉండటంతో అత్యవసరంగా చికిత్స అందించవలసి ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ విషయంపై సంజయ్ ఆప్త మిత్రుడు ఒకాయన బాలీవుడ్ హంగామాతో మాట్లాడుతూ.. ‘‘బాబా కూలబడిపోయారు.

ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు, వారు ప్రస్తుతం దుబాయిలో తల్లి వద్ద ఉన్నారు. కానీ, వారికి ఈ భయంకరమైన విషయాన్ని చెప్పడం ఒక అగ్ని పరీక్ష’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది కాదని దీనిని నయం చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని బంధుమిత్రులు వెల్లడించారు. దీనికి సంబంధించి సంజయ్ దత్ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. వైద్యులు సూచన మేరకు తాను సినిమా షూటింగ్‌ల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తనతో పాటు కుటుంబం సభ్యులు, స్నేహితులు తోడుగా ఉన్నారని, తన శ్రేయోభిలాషులు ఎలాంటి కంగారు పడొద్దని ఆయన ట్విట్టర్ లో చెప్పారు. అయితే తనకు క్యాన్సర్ సోకిందన్నవిషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం సంజయ్ దత్ కేజిఎఫ్ 2అధీర పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad