Home టాప్ స్టోరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో దూసుకొస్తున్న సమంత ..గెట్ రెడీ

‘ఫ్యామిలీ మ్యాన్-2’తో దూసుకొస్తున్న సమంత ..గెట్ రెడీ

Samantha 1

లాక్ డౌన్ తర్వాత దేశంలో వెబ్ సిరీస్ ల వ్యూవర్ షిప్ భారీగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అగ్ర కథానాయకులు అందరు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత కూడా అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో దర్శకుడు సెకండ్ సీజన్ కు శ్రీకారం చుట్టాడు. దీనిలో భాగంగా మరికొన్ని నెలల్లో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ విడుదలకానుంది. రెండో భాగంలో సమంత నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ కు తాజాగా సమంత డబ్బింగ్ వర్క్ ను కూడా మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ. ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 డబ్బింగ్ చెప్తున్నాను. మీరు క్రేజీ రైడ్ కోసం ఉన్నారు. థ్యాంక్ యూ’ అని రాసుకొచ్చి రాజ్ – డీకే లను ట్యాగ్ చేసింది సామ్. సాధారణంగా సమంత పాత్రలకు ప్రముఖ సింగర్ చిన్మయి డబ్బింగ్ చెబుతుంది. అయితే గత కొంత కాలంగా సమంతనే సొంతంగా డబ్బింగ్ చెబుతూ వస్తోంది.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం  ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కోసం సమంత తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పనుందని తెలుస్తోంది. కాగా ఈ వెబ్ సిరీస్ లో సమంత పాకిస్తాన్ టెర్రరిస్ట్ నటించబోతున్నట్లు సమాచారం. తెలుగులో అగ్ర కథానాయిక అయి ఉండి ఒక వెబ్ సిరీస్ కోసం నెగిటివ్ పాత్ర చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాయ్ పాయ్ – ప్రియమణి – సందీప్ కిషన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad