Home సినిమా సమంత సూపర్ క్రేజ్ : నాకు నేనే సాటి !

సమంత సూపర్ క్రేజ్ : నాకు నేనే సాటి !

Samantha

దక్షిణాది అగ్ర కథానాయికల్లో సమంత ఒకరు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా అరంగేట్రం చేసినా సమంత అతి తక్కువ సమయంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది. టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలు బిజీగా ఉన్న సామ్ ఇప్పటివరకూ బాలీవుడ్ పై మాత్రం దృష్టి సారించలేదు. అయితే తాజాగా ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన నివేదిక ప్రకారం : సౌత్ ఇండియాలో అత్యంత ఫాలోయింగ్‌ ఉన్న తారల జాబితాలో సమంతా అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తరువాత అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, రష్మిక మండన్న, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, నయనతార, కీర్తి సురేష్, త్రిష కృష్ణన్‌లకు ఈ లిస్ట్‌లో స్థానంలో దక్కింది. క్రితం సమంత నటించిన ఓ బేబీ, మజిలీ, సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు దర్శకనిర్మాతలు ఈ సినిమాలను ఇతర భాషల్లోకి అనువాదం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దీనికి ప్రధాన కారణం ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండడమే. ప్రస్తుతం సమంత తమిళ్ లో నటించిన ”సూపర్ డీలక్స్” సినిమా హిందీలో డబ్బింగ్ కానున్నట్లు తెలుస్తోంది సమంత ప్రధాన పాత్రలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంతా ఉగ్రవాదిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ షోలో ప్రియమణి, షరీబ్ హష్మి, శ్రేయా ధన్వంతరి, శరద్ కేల్కర్, దర్శన్ కుమార్, దలీప్ తహిల్, షాహాబ్ అలీ మరియు మనోజ్ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ కూడా అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కుతోంది. దర్శకనిర్మాతలు అందరూ సమంత క్రేజ్ ను ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతున్నారని స్పష్టంగా కనిపిస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad