Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఓటిటి వద్దయ్యా.. పాపం సాయితేజ్

ఓటిటి వద్దయ్యా.. పాపం సాయితేజ్

thumb 13

ముందు నుయ్యి .. వెనక గొయ్యి.  ప్రస్తుతం ఇది మన  టాలీవుడ్ హీరోల పరిస్థితి. ఒకప్పుడు సక్సెస్ లేక చాలా కష్టాలు పడ్డ యువ హీరోలు. ఇప్పుడు విజయం సాధించిన ఏం ప్రయోజనం లేకుండా పోయిందని తీవ్రంగా మదనపడుతున్నారు. ఎందుకంటే? హిట్ వున్నా లేకున్నా సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి లేదు. విడుదలైన భారీ వసూళ్లు రావు. అటువంటప్పుడు సక్సెస్ తో పనేంటి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కి తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ తక్కువ సమయంలోనే మంచి విజయాలను సాధించాడు. అయితే తర్వాత వరుస ఫ్లాపులు రావటంతో డీలా పడ్డాడు. ఈ సమయంలో విడుదలైన చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. వీటితో సాయితేజ్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

ఈ విజయం పరంపరని కొనసాగించడానికి కొత్త దర్శకుడు సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌ సినిమాను చేశాడు. ఇందులో న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టించగా ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించారు. క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే.. ఈ సినిమా మే 1న విడుద‌ల కావాల్సింది. అయితే కోవిడ్ 19 ప్ర‌భావంతో ఈ సినిమా విడుద‌ల ఆగింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. స్నేహితులు సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని సాయితేజ్ కు చెప్పారట. అయితే హీరో మాత్రం నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది.

దీనికి ప్రధాన కారణం సినిమా ఓటిటిలో విడుదలయ్యే అవకాశం ఉండటమే. ఎన్ని రికార్డులు సాధిస్తేనే చివరికి నా సినిమా ఓటిటిలోనే విడుదల అవుతుంది అంటూ సాయి తేజ్ నిట్టూరుస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఓ ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ సినిమా కోసం నిర్మాత‌ల‌కు పాతిక కోట్ల మేర‌కు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad