Home సినిమా గాసిప్స్ ఆదిపురుష్‌లో విలన్‌గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

ఆదిపురుష్‌లో విలన్‌గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Saif Ali Khan As Villain In Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ రెండు చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన 21వ చిత్రాన్ని అనౌన్స్ చేయగా, రీసెంట్‌గా తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్’ను అనౌన్స్ చేశాడు. కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ప్రొడ్యూస్ చేయనుంది. అయితే ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులోనూ తెరకెక్కించి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర దర్శకుడు ఓం రావుత్ సిద్ధమవుతున్నాడు.

Saif Ali Khan As Villain

అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోండగా, విలన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్‌ను ఈ సినిమాలో విలన్‌గా తీసుకునేందుకు చిత్ర దర్శకుడు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన తెరకెక్కించిన తాన్హాజీ చిత్రంలోనూ సైఫ్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి ఆయన్ను విలన్‌గా తన సినిమాలో తీసుకునేందుకు ఓం రావుత్ రెడీ అవుతున్నాడు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుండటంతో ఆదిపురుష్ చిత్రం ట్రెండింగ్‌లో సాగుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad