Home సినిమా టాలీవుడ్ న్యూస్ అదిరిపోయే కాన్సెప్ట్‌తో వస్తున్న తేజు

అదిరిపోయే కాన్సెప్ట్‌తో వస్తున్న తేజు

Sai Dharam Tej Sukumar New Movie Announced

మెగా కాంపౌండ్ నుండి హీరోగా వచ్చి సుప్రీం హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ను రిలీజ్‌కు రెడీ చేశాడు. కాగా ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న సాయి ధరమ్ తేజ్, ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నాడు.

కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే థియేటర్లు తెరుచుకోగానే ఈ సినిమా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనకున్నారు. కానీ ఇప్పట్లో థియేటర్లు రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తేజు తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేశాడు. సుకుమార్ రైటింగ్స్‌లో రాబోయే ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను తాజాగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ టాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను మిస్టీక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, పోస్టర్‌ను చాలా క్యూరియస్‌గా రూపొందించారు. సంస్కృత పద్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో షట్‌చక్రంలో ఓ కన్ను చూపిస్తూ డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను అలరిస్తోంది. మొత్తానికి ఈ సినిమా ఏదో విభిన్నమైన కాన్సెప్ట్‌తో రాబోతుందనే విషయం ఈ పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతోంది. కాగా ఈ సినిమాలోని మిగతా నటీనటులు ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad