
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఇక థియేటర్లు తెరుచుకోగానే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు తేజు అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
కాగా ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కించిందని, ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. థమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని చిత్ర యూనిట్‌ను ప్రశ్నించగా వారి నుండి ఎవ్వరూ ఊహించని సమాధానం వస్తోంది.
ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని చూసిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో చిత్ర యూనిట్ చాలా నిరాశకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆకట్టుకునే కథాంశం ఏమీ లేకపోవడమే ఈ నిరాశకు కారణమని సినీ క్రిటిక్స్ అంటున్నారు. థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయితే, ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే కారణంగానే ఈ సినిమాను ఓటీటీలో హడావుడిగా రిలీజ్ చేస్తున్నట్లు పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా తేజు ఈ సినిమాతో హిట్ కొడతాడా లేక ఫ్లాప్ మూటగట్టుకుంటాడా అనేది చూడాలి.