Home సినిమా గాసిప్స్ సాయి ధరమ్ తేజ్ తో దెయ్యం : వామ్మో

సాయి ధరమ్ తేజ్ తో దెయ్యం : వామ్మో

sai

మెగా ఫ్యామిలీ నుండి దూసుకువచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ పరిశ్రమకు సుప్రీం హీరోగా మారాడు. సుప్రీం సినిమాతో కామెడీ, చిత్రలహరితో ప్రేమను పరిచయం చేసి, ప్రతి రోజూ పండగే సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. అయితే మొదటి నుండి ఒకే జోనర్లో సినిమాలు చేయడానికి ఇష్టపడని సాయి ధరమ్ తేజ్ ఏప్పుడు సరికొత్త కధలను ఎన్నుకుంటేనే ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు యంగ్ హీరోల్లో ఎవరు చేయని సాహసాన్ని ఇప్పుడు సాయి చేస్తునట్టు తెలుస్తుంది.

గతంలో యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ సినిమాలు చేసిన ఈ హీరో మొదటి సారి దెయ్యం అవతారం ఎత్తనున్నాడని అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు ఒకరు హారర్ థ్రిల్లర్ కధతో సాయి ధరమ్ తేజ్ ను ఒప్పించినట్టు సమాచారం. కధ సాయికి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పారంట. ఈ సినిమాకు సుకుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మాణం కానుంది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 2021  చివరన పట్టాలెక్కినుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.

ఇప్పటికే ఈ మెగా హీరో కొత్త దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో ఇప్పటికే సోలో బతుకే సో బెటరు సినిమాను చేశారు. ఈ సినిమా దాదాపు పూర్తయినప్పటికీ కొంచెం ప్యాచ్ వర్క్ ఉన్నట్టు తెలుస్తోంది. దీని తరువాత దేవాకట్టా డైరక్షన్ లో ఓ సినిమా ఓకె చేసారు. ఈ సినిమా కరోనా కట్టడి తరువాత జరగనుంది. అంటే 2021 సాయి ఫుల్ బిజీ అప్పుడు ఈ హర్రర్ థ్రిల్లర్ ను ఎలా మొదలుపెడతార. దేవకట్టా సినిమాను హోల్డ్ చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారా ! లేక రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తారా? అనే ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లో సమాధానం తెలియనుంది. ఒకే జోనర్ లో సినిమాలు చేయకుండా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న సాయి ధరమ్ తేజ్ మరిన్ని విభిన్న సినిమాలను చేయలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad