Home టాప్ స్టోరీస్ పరమ చెత్త సినిమారా బాబు (ఐఎండీబీ):స‌డ‌క్2

పరమ చెత్త సినిమారా బాబు (ఐఎండీబీ):స‌డ‌క్2

Sadak 2 New Posters Out Alia Bhatt Sanjay Dutt And

కాలం కలిసిరానప్పుడు చేతులు కట్టుకుని కూర్చోవడం తప్ప మరో పరిస్థితి ఉండదు. కాదు నేను దూసుకుపోతా అంటే తగిలే ఎదురు దెబ్బలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పదాలు స‌డ‌క్-2 సినిమాకు సరిగ్గా సరిపోతాయి. సుశాంత్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో రియా చక్రబోర్తి కంటే అలియా భ‌ట్ మరియు ఆమె సన్నిహిత వర్గం తీవ్రమైన ప్రభావాన్ని చవి చూస్తుంది. సుశాంత్ అభిమానులు రియా ఆత్మహత్యకు ప్రేరేపించిదని ఆరోపిస్తూ ఉండగా, అలియా భ‌ట్ టీం నెపోటిజాన్ని ప్రోత్సహించారని సుశాంత్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.

ఈ సమయంలో స్టార్ డైరెక్ట‌ర్ మ‌హేశ్ భ‌ట్ నిర్మించిన‌, ఆమె కూతురు, హీరోయిన్ అలియా భ‌ట్ న‌టించిన “స‌డ‌క్ 2” చిత్ర ట్రైలర్ విడుదలైంది. అలియా మీద కోపంతో ఉన్న సుశాంత్ అభిమానులు ఈ ట్రైలర్ కు డిస్ లైక్స్ మోత మోగించారు. ఈ సినిమా ట్రైల‌ర్ ప్ర‌పంచంలోనే అత్య‌ధిక డిస్‌లైకులు తెచ్చుకున్న రెండో యూట్యూబ్ వీడియోగా రికార్డుకెక్కింది. తాజాగా ఈ చిత్రం ఆగ‌స్టు 28న ఓటీటీలో విడుద‌లైన సంగతి తెలిసిందే. అప్పటికే కోపోద్రిక్తులై ఉన్న సుశాంత్ అభిమానులు ఈ సినిమాకు సరికొత్త రికార్డును తెచ్చిపెట్టారు.

ప్రపంచంలోని పరమ చెత్త రేటింగ్ తో ఈ సినిమా సరికొత్త రికార్డును దక్కించుకుంది. ఈ చిత్రం పరమ చెత్తగా ఉందంటూ దాదాపు 35 వేలకు పైగా ప్రేక్షకులు ఐఎండీబీలో 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇప్పటికే మరికొంతమంది రేటింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. దీంతో ఐఎండీబీలో చరిత్రలో పరమ చెత్త సినిమాగా స‌డ‌క్-2 నిలిచింది. అంతేకాదు ఐఎండీబీలో 1 స్టార్ రేటింగ్ అందుకున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక 1.3 స్టార్ రేటింగ్‌తో ట‌ర్కీ సినిమా రెండో స్థానంలో ఉంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో సుశాంత్ సేన సృష్టించే ప్రభంజనం ఊహలకు అందని అభిమానులు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad