Home సినిమా టాలీవుడ్ న్యూస్ రాధేశ్యామ్‌కు వాయిస్తున్న సాహో టెక్నీషియన్

రాధేశ్యామ్‌కు వాయిస్తున్న సాహో టెక్నీషియన్

Saaho Technician To Work For Radhe Shyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాతో అదిరిపోయే రికార్డును మరోసారి క్రియేట్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో మనకు కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపెట్టారు.

ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తు్న్నారనే అంశంపై ఇప్పటికీ డైలమా నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు బ్యా్క్‌గ్రౌండ్ స్కోర్ కోసం సాహో చిత్రానికి వర్క్ చేసిన గిబ్రన్ అందించనున్నట్లు తెలుస్తోంది. సాహో చిత్రానికి గిబ్రన్ అందించిన రి-రికార్డింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు మరోసారి రాధేశ్యామ్ చిత్రానికి గిబ్రన్ బ్యాక్‌గ్రౌండ్ అందిస్తుండటంతో ఈ సినిమా కోసం ఆయన ఎలాంటి సంగీతాన్ని అందిస్తాడా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad