Home సినిమా గాసిప్స్ ప్రభాస్ దెబ్బకు ఆ నిర్మాతల పరిస్థితి ఏమిటి?

ప్రభాస్ దెబ్బకు ఆ నిర్మాతల పరిస్థితి ఏమిటి?

Saaho Producers Still In Financial Crisis

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా లాంఛ్ అయిన యువీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ టాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ అతి తక్కువ సమయంలో టాప్ బ్యానర్‌గా మారింది. కేవలం సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా భారీ చిత్రాలను కూడా ఈ బ్యానర్‌లో తెరకెక్కించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’ అత్యంత భారీ వ్యయంతో ఈ బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే సాహో చిత్రంతో అదిరిపోయే లాభాలను అర్జించాలని చూసిన యూవీ క్రియేషన్స్‌కు నష్టాలే మిగిలాయి. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో సాహో చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ సినిమా కేవలం హిందీలో మాత్రమే హిట్ కాగా ఇతర భాషల్లో చెప్పుకోదగ్గ ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమాపై యూవీ క్రియేషన్స్‌కు ఏకంగా రూ.250 మేర నష్టం వాటిల్లింది. దాన్ని పూడ్చేందుకు నిర్మాతల్లో ఒకరైన ప్రభాస్ చాలా కష్టపడాల్సి వచ్చింది.

కాగా ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’పై యూవీ క్రియేషన్స్ ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసిన నిర్మాతలకు మరో 200 కోట్లు అవసరం పడ్డాయి. దీంతో ప్రభాస్ పలు పాన్ ఇండియా చిత్రాలను వరుసగా సైన్ చేస్తూ వస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా యూవీ క్రియేషన్స్ కోలుకోవడం కష్టం అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. మరి యూవీ క్రియేషన్స్‌కు రాధేశ్యామ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad