
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ప్రభాస్ నటించిన సాహో చిత్రం గురించి అందరికీ తెలిసిందే.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే అంచనాలతో రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో వెనకబడటంతో యావరేజ్ మూవీగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను దద్దరిల్లిస్తోంది. అవును.. మీరు చదివింది నిజమే. అయితే ఇది మనదగ్గర కాదు. జపాన్ దేశంలో థియేటర్లు తెరుచుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభాస్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఈ నేపథ్యంలోనే సాహో చిత్రం అక్కడ భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమా 150 రోజులు పూర్తి చేసుకుని అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికీ ఈ సినిమాకు అక్కడ మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ప్రభాస్ అండ్ టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.