Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఫారిన్ చెక్కేస్తున్న ఆర్ఆర్ఆర్.. అంతా అక్కడే!

ఫారిన్ చెక్కేస్తున్న ఆర్ఆర్ఆర్.. అంతా అక్కడే!

rrr thumb 2

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అత్యంత భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. ఇక పరిస్థితుల చక్కబడ్డాకే ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఇక్కడ షూటింగ్ చేయాలంటేనే చిత్ర యూనిట్ భయపడుతోంది.

అయితే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా తన లేటెస్ట్ మూవీ బెల్ బాటమ్ షూటింగ్‌ను ఇండియాలో కాకుండా ఫారిన్‌లో తెరకెక్కించేందుకు వెళ్లడంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా ఇదే తరహా స్ట్రాటెజీని ఫాలో అవ్వాలని చూస్తోంది. ఇక్కడి కంటే కరోనా విజృంభన తక్కువ ఉన్న దేశంలో ఈ సినిమా షూటింగ్‌ను ముగించేయాలని జక్కన్న అండ్ టీమ్ భావిస్తోందట. అందుకే ఈ సినిమా షూటింగ్‌ను ఫారిన్‌లో నిర్వహించేందుకు ఆర్ఆర్ఆర్ యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad