
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్లను చిత్ర యూనిట్ ఎంపిక చేశారు.
అయితే ప్రస్తుతం బాలీవుడ్లో ఆలియా భట్‌పై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి వాకౌట్ చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు కొత్త తలనొప్పి తలెత్తింది. అయితే ఆలియా భట్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ను కూడా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే బాలీవుడ్ బ్యూటీలు కాకుండా స్టార్డమ్ ఉన్న సౌత్ బ్యూటీలను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా వీరెవరూ కుదరకపోతే, ఫారిన్ బ్యూటీని తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇప్పటికే ఒలివియా మారిస్‌ను తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో బ్యూటీని తీసుకోవాలని చూస్తున్నాడు. మరి ఆలియా భట్ స్థానంలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.