Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఆర్ఆర్ఆర్‌కు మరో ఎదురుదెబ్బ.. నిర్మాతకు కూడా కరోనా!

ఆర్ఆర్ఆర్‌కు మరో ఎదురుదెబ్బ.. నిర్మాతకు కూడా కరోనా!

rrr producer thumb

ప్రస్తుతం కరోనా వైరస్ అన్ని వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుంది. కేవలం సాధారణ ప్రజలకే కాకుండా సెలబ్రిటీలకు సైతం ఈ వైరస్ సోకుతుండటంతో సినీ జనాలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన తన ఫాం హౌజ్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న సంగతిని తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రొడ్యూసర్ డివివి దానయ్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం పనిచేస్తున్న చాలా మంది టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్ అని వస్తుండటంతో సదరు చిత్ర యూనిట్ భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ను లెక్కచేయకుండా పలువురు ఈ సినిమా పనుల్లో పాల్గొన్నారని, అందుకే ఇప్పుడు వారు కరోనా బారిన పడ్డారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక డివివి దానయ్యకు కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు.

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ఆర్ఆర్ఆర్‌ను పీరియాడికల్ మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. కాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్ర యూనిట్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad