Home సినిమా RRR జక్కన్న సినిమాలో డైసీ ఎడ్గార్ జోన్స్ ఎందుకంటే..?

RRR జక్కన్న సినిమాలో డైసీ ఎడ్గార్ జోన్స్ ఎందుకంటే..?

రాజమౌళి దర్శకత్వం లో ఫిక్షనల్ కథగా ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్న సినిమా RRR. ఈ సినిమాలో తెలుగులో అగ్రనటులైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్న సంగతి అందరికి తెలిసిందే. రాజమౌళి ప్రెస్ మీట్ లో సినిమా కి సంబందించిన విషయాలను పంచుకోగా బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నుండి నటులను టాలీవుడ్ లోకి దింపుతూ మరిన్ని అంచనాలను పెంచుతున్నాడు.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియాభట్, జూనియర్ ఎన్టీఆర్ జోడిగా హాలీవుడ్ అమ్మడు డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నట్లు ప్రకటించాడు. అంతే ఇక ఎవరి డైసీ ? ఈ సినిమాలో ఆమె ఎందుకు ? అంటూ గూగుల్ కి పని పెట్టేశారు అందరు. అందుకే మీ అందరి కోసం డైసీ ఎడ్గార్ జోన్స్ గూర్చి..

డైసీ గూర్చి డిటెయిల్స్ :

హాలీవుడ్లో చాలా ప్రఖ్యాతి చెందిన యువతీ. ఒక థియేటర్ ఆర్టిస్ట్ . టీవీ కార్యక్రమలు చేస్తూ టీవీ లకు సైతం పాపులారిటీ తెచ్చిపెట్టిన యంగ్ బ్రిటన్ నటి. ‘కోల్డ్ ఫీట్’ అనే ఒక టీవీ షో తో 2017లో ఎంట్రీ ఇచ్చింది. అంతే ఇక టీవీ షో రేటింగ్ ఒక్కసారిగా పెరిగిందట.

అందం, అభినయం కలబోసినా డైసీ కి ప్రేక్షకులలో పేరు తెచ్చుకోవడముతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తరువాత వరుసగా పాండ్ లైఫ్, వార్ అఫ్ ది వరల్డ్, అవుట్ నంబర్డ్ , సైలెంట్ విట్నెస్ లాంటి తదితర బ్రిటన్ పాపులార్ టీవీ కార్యక్రమాల్లో చేసింది. అదేవిదంగా ‘ది రెలెక్యుటెంట్ ఫండమెంటలిస్ట్’ నాటకంలో , ‘వింటర్ సాంగ్’ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. రెండు సంవత్సరాలలో ఎంతో పేరు సంపాదించుకున్న యంగ్ నటి. ఈ సంవత్సరంకి గాను రాజమౌళి చేతిలో చిక్కిందంటే ఎంత పాపులారిటీ ఉందొ బ్రిటన్లో డైసీ కి ఆలోచించండి.

డైసీ నటనలోకి..

ఐదు సంవత్సరాల వయస్సులోనే పాఠశాలలో జరిగిన ఒక నాటకంలో నటించిందట. ఆమె నటనకు అంతచిన్న వయస్సులోనే వచ్చిన ప్రశంసల వర్షమే .. ఈరోజు నటనను చేసే దిశగా మలిచింది. చదువు అంతంత మాత్రమే.. ఆమె నటనలో ప్రతిభను చూసుకొని ఆసక్తి పెంచేసుకుందట. పద్నాలుగు సంవత్సరాల వయస్సులో ‘నేషనల్ యూత్ థియేటర్ ‘ నుంచి ఎడ్గార్ జోన్స్ నటన కోర్సు చేసిందట. అక్కడ నేర్చుకున్న కోర్స్, ప్రస్తుతం ప్రొఫెషనల్ నటిగా నటించుటకు ఉపయోగపడుతుందట.

Daisy edger jones
Daisy edger jones acting in RRR movie

ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను చూడటం, అక్కడ ఫొటోలు దిగటం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫొటోస్ షేర్ చేయడం..హబిట్స్గా చెప్పవచ్చు. డైసీకి చిరు తిళ్ళు, షేక్స్ చాలా ఇష్టమట. ఇంకా గులాబీ, టాటూస్ ని ఇస్టపడుతుందట. ఇవండీ సంగతి మీ క్యూరియాసిటీ తగ్గిందనుకుంటా..

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad