Home సినిమా టాలీవుడ్ న్యూస్ సుశాంత్ కేసులో రానా,రకుల్ : సంచలన నిజాలు

సుశాంత్ కేసులో రానా,రకుల్ : సంచలన నిజాలు

reha

సుశాంత్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతుంది. ప్రతి రోజు ఈ కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ అనుమానాస్పద మృతి, బ్యాంకు అకౌంట్లలో అవకతవకలు, మనీ లాండరింగ్ వంటి పలు అంశాల పై కేసు నమోదు చేసి ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో రియా చక్రవర్తిని ఏ వన్ ముద్దాయిగా చేర్చిన సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.  సుశాంత్  ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ఎవరిని కలిశారు, ఎవరికి ఫోన్ చేశారనే విషయంపై అధికారులు దృష్టి సారించారు. తాజాగా ఆమె కాల్ డేటాను పరిశీలించగా సంచలన నిజాలు వెలుగుచూశాయి.

ఆమె గత కొద్ది నెలలుగా టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్ డేటాను విశ్లేషించిన అధికారులు ఆమె టాలీవుడ్‌కు చెందిన రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి బాలీవుడ్‌కు చెందిన అమీర్ ఖాన్, శ్రద్దాకపూర్, ఆదిత్య రాయ్ కపూర్, దివంగత సరోజ్ ఖాన్ తదితరుల ఫోన్లో సంభవించినట్లు సమాచారం అందుతుంది. ఈ లిస్ట్ లో మరికొంత మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ  కాల్ డేటాలో రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య అధిక సంభాషణ జరిగినట్టు రికార్డయింది. రకుల్ ప్రీత్ సింగ్‌కు రియా 30 సార్లు కాల్ చేయగా, రియా రకుల్ కు 14 సార్లు కాల్ చేసినట్టు రికార్డు అయ్యాయి. అంతేకాకుండా వారిద్దరు వారి మధ్య సాధారణ ఎస్ఎంఎస్ల సంభాషణలు కూడా జరిగినట్టు స్పష్టమైంది.

ఇక టాలీవుడ్ టాప్ హీరో రానా దగ్గుబాటితో కూడా అధిక సమయం రియా ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది. రియా రానాకు 7 సార్లు కాల్ చేయగా, రానా ఆమెకు నాలుగు సార్లు కాల్ చేశారనేది కాల్ డేటాలో రికార్డు అయినట్టు అధికారులు తెలిపారు . బాలీవుడ్ అగ్ర కథానాయకులతో కూడా ఆమె టచ్ లో ఉన్నట్లు వెలుగు చూసింది.అమీర్ ఖాన్‌, ఆదిత్య రాయ్, శ్రద్దాకపూర్‌, సరోజ్ ఖాన్‌కు పది సార్లు ఆమె కాల్ చేసినట్టు రికార్డయింది. ఇప్పుడు ఇదే విషయంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. వాట్సాప్ డేటాను కూడా రికవరీ చేయడానికి దర్యాప్తు సంస్థలు సిద్దామయ్యాయని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad