
బాలీవుడ్‌ను కుదిపేసిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రియాతో పాటు ఆమె సోదరుడిని విచారించిన సీబీఐ అధికారుల కొత్త విషయాలను వెల్లడించారు. రియా చక్రవర్తికి పలువురు డ్రగ్స్ డీలర్లతో లింక్ ఉన్నట్లు వారి విచారణలో తేలింది.
గతకొన్నేళ్లుగా తాన ఈ మాదకద్రవ్యాలను తీసుకుంటున్నట్లు రియా వెల్లడించింది. ఈ క్రమంలో ఆమె మొబైల్లోని వాట్సాప్ చాట్‌లో డ్రగ్స్ డీలర్లతో ఆమె జరిపిన సంభాషణ వెలుగు చూసింది. డ్రగ్ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్ ఆర్య అనే వ్యక్తితో రియా చాలా తరుచుగా చాటింగ్ చేసింది. 2018 మార్చి 8 నుండి గౌరవ్ తనతో టచ్‌లో ఉంటున్నట్లు రియా చెప్పుకొచ్చింది. మిథిలీన్ డయాక్సీ మెథాంఫేటమిన్ అనే డ్రాగ్ కోసం రియా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అటు సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుండి రియా రూ.15 కోట్ల డబ్బు తీసుకుందనే ఆరోపణపై ఆమెను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు చివరకు ఎటు వెళ్తుందా అని సుశాంత్ సింగ్ అభిమానులు అంటున్నారు. మరి ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందో త్వరగా బట్టబయలు చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు.