Home సినిమా వర్మ పవర్ స్టార్..రికార్డుల్లో సూపర్ స్టార్ !

వర్మ పవర్ స్టార్..రికార్డుల్లో సూపర్ స్టార్ !

PicsArt 08 03 04.14.03

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు గురించి ప్రత్యేకమైన ఇంట్రోలు, స్పెషల్ ఎఫెక్ట్ లు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వర్మ అంటే వివాదం, వివాదం అంటేనే వర్మ.. కాదు కాదు ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ వర్మ ఉంటాడు. అమ్మాయిలు నుండి అణుబాంబులు వరకు మాఫియా నుండి మట్టి వరకు దేన్ని వదలడు. సాధారణంగా వర్మ తీసే చాలా సినిమాలు కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రెస్. తాజాగా జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరుతో సినిమా మొదలు పెట్టి దానికి పవర్ స్టార్ అని పేరు పెట్టి, అందులోని క్యారెక్టర్ కు ప్రవర్ స్టార్ అని నామకరణం చేసి ఓటిటిలో విడుదల చేశాడు.ఇటువంటి సినిమాలు వర్మకు కొత్త ఏమి కాదు. క్రితం విడుదల చేసిన నేకిడ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వర్మ ఎడాపెడా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అయితే అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచొ ఒక సందేహం ఉంది.

అసలు వర్మకు ఈ సినిమాలు వలన ఏమైనా కలెక్షన్లు వస్తున్నాయా ! రాకపోతే ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తునట్టు అని ఎక్కువ మంది అనుకుంటున్నారు. వాస్తవానికి రక్త చరిత్ర తర్వాత నుండి ఇప్పటివరకు వర్మ తీసిన అన్ని సినిమాలు కలిపి ట్రాఫిక్ 10 కోట్లు కూడా ధాటి ఉండదు. అయితే పవర్ స్టార్ మాత్రం భారీ లాభాలు తీసుకొచ్చిందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాను దాదాపు రెండు లక్షల మంది చూసినట్టు తెలుస్తుంది. ఇందులో 1 లక్ష 20 వేల మంది 150 రూపాయలు పే చేసి చూసరంటా. పవర్ స్టార్ సినిమా తీయడానికి వర్మ కు 10 లక్షలు ఖర్చయితే వచ్చిన లాభం 2 కోట్ల 30 లక్షల రూపాయిలు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాకు ఈ స్థాయిలో లాభాలు రావడానికి ప్రధాన కారణం పవన్ ఫ్యాన్స్. వర్మ పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి సినిమాకు భారీ క్రేజ్ తీసుకువచ్చారు. దీనితో పవన్ కళ్యాణ్ పేరుని ఉపయోగించుకొని మరో 5 సినిమాలు తియ్యడానికి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad