Home టాప్ స్టోరీస్ వర్మకు ఫ్రీ పబ్లిసిటీ.. ఇకనైనా మారండి ప్లీజ్

వర్మకు ఫ్రీ పబ్లిసిటీ.. ఇకనైనా మారండి ప్లీజ్

ram gopal verma 640x480 bccl

టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ రూటే సపరేటు. ఆయన ఏం చేసినా సంచలనమే. వరుస బయోపిక్స్ తో  దూసుకుపోతున్న వర్మ చివరికి తన మీద తానే బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించాడు. ప్రకటించిన కొద్దిసేపటికే మూవీస్ టైటిల్ ను విడుదల చేశాడు. రాము అనే తన పేరునే మూవీ టైటిల్ గా పెడుతూ  ట్యాగ్ లైన్ గా “ఏ బయోపిక్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ” అని విడుదల చేశాడు.వ ర్మ జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. సినీ కెరీర్ మొదలు పెట్టిన నుండి నేటి వరకు వర్మ తీసుకున్న ప్రతి నిర్ణయం అనేక వివాదాలకు, ఎన్నో సంచలనాలకు దారి తీసింది. ఈ సమయంలో వర్మ కొంతమంది సెలబ్రిటీలను మరియు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ సినిమాలను రూపొందించాడు. దీంతో ఆగ్రహించిన కొంతమంది అభిమానులు వర్మ పేరుతో సినిమాలు తీయడానికి సిద్ధమయ్యారు.

రాము సినిమా సినిమాను ప్రకటించిన వెంటనే వారి శత్రువులు మరో రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు చూస్తున్నట్లయితే ఒకప్పటి య‌న్టీఆర్ బ‌యోపిక్ సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో డైరెక్టర్ క్రిష్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా కథానాయకుడు, మహానాయకుడు అనే సినిమాను తెరకెక్కించాడు. దీనికి పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాలన్ని వర్మ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీని చేస్తూ భారీ లాభాలను చేకూర్చాయి. ఇప్పుడు రాము బయోపిక్ కు పోటిగా రాంగో, రోజూ గిల్లే వాడు వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. దీంతో వర్మ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

కొంతమంది విశ్లేషకులు మాత్రం ఈ చిత్రాలపై ఘాటుగా విమర్శిస్తున్నారు. పిచ్చోడు మీద ఇన్ని సినిమాలు తీసేవారికైనా బుద్ధుండాలి అని ఫిల్మ్ న‌గ‌ర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ మొత్తం మూడు భాగాలుగా రానుంది. అయితే ఇది వెబ్ సిరీస్ కాదు.  ప్రతి భాగం దాదాపు రెండున్నర గంటల నిడివి ఉండ నుందని తెలుస్తోంది. అంటే మొత్తం మూడు భాగాలు కలిపి దాదాపు ఆరు గంటలు నిడివి ఉండనుంది. ఈ బయోపిక్ కథా, కథనాలని వర్మ అందించగా ఆయన శిష్యుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బొమ్మాకు మురళి నిర్మించగా, వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad