Home టాప్ స్టోరీస్ వర్మ బయోపిక్:ఈయన ఊహలు వర్ణనాతీతం

వర్మ బయోపిక్:ఈయన ఊహలు వర్ణనాతీతం

ram gopal verma 640x480 bccl

రాంగోపాల్ వర్మ అంటే దర్శకుడు మాత్రమే కాదు ఓ కాంట్రవర్సి కింగ్. ఈ దర్శకుడు సినిమాల్లో కథ కథనం కంటే వివాదాలే ఎక్కువగా ఉంటాయి. వాటి ద్వారానే వర్మ పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు. వివాదాల వర్మ కథల్లోనే కాదు ఆయన జీవితంలో కూడా అనేకం ఉన్నాయి. సినీ కెరీర్ మొదలు పెట్టిన నుండి నేటి వరకు వర్మ తీసుకున్న ప్రతి నిర్ణయం అనేక వివాదాలకు ఎన్నో సంచలనాలకు తెర తీసింది. వర్మ గిట్టనివాళ్లు ఆయనను విమర్శిస్తూ రాంగో, రోజూ గిల్లే వాడు, పరాన్నజీవి లాంటివన్నీ సెటైరిక్ సినిమాలు తీస్తూ రోత పుట్టిస్తున్నారు. ఎవరో సినిమా తీయడం ఎందుకు ? తనమీద తానే సినిమా తీసుకుంటానని అనేకసార్లు చెప్పిన వర్మ ఎట్టకేలకు తన బయోపిక్ ను తానే ఎనౌన్స్ చేశాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. దీనికి “రాము” అని టైటిల్ పెట్టి ట్యాగ్ లైన్ గా  “ఏ బయోపిక్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ” అని విడుదల చేశాడు. ఈ బయోపిక్ మొత్తం మూడు భాగాలుగా రానుంది. అయితే ఇది వెబ్ సిరీస్ కాదని ప్రతి భాగం దాదాపు రెండున్నర గంటల నిడివి ఉండనుందని తెలుస్తోంది. అంటే మొత్తం మూడు భాగాలు కలిపి దాదాపు ఆరు గంటలు నిడివి ఉండనుంది. ఈ బయోపిక్ కథా,కథనాలని వర్మ అందించగా ఆయన శిష్యుడు దొరసాయి తేజ అనే వ్యక్తికి దర్శకత్వం వహిస్తాడని వర్మ ప్రకటించారు. ఈ చిత్రాన్ని బొమ్మాకు మురళి నిర్మించగా, వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు.

మొదటి భాగం వర్మ బాల్య జీవితానికి సంబంధించి విశేషాలు ఉండగా రెండో భాగంలో శివ సినిమా ఎలా తెరకెక్కించాడు, సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఆటంకాలు ఏమిటి? వాటిని వర్మ ఎలా పరిష్కరించాడు అన్నది ఉండనుంది. ఇక చివరి భాగం ఇంటెలిజెంట్ ఇడియట్ పేరిట తెరకెక్కనుంది. ఇందులో వర్మ ఫెయిల్యూర్స్,  రాడికల్ ఆలోచనలు, దేవుడు-సెక్స్-సమాజంపై తన విపరీత ఆలోచల్ని వంటి వాటిని ఆవిష్కరించనున్నారు అని వర్మ స్వయంగా తెలిపాడు. చివరికి తన మీద తానే బయోపిక్ తీసుకుంటూ కొత్త వివాదానికి తెరలేపారు వర్మ. ఇందులో ఎన్ని సంచలన నిజాలు బయట పెడతారో చూడాలి మరి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad