Home టాప్ స్టోరీస్ ఓటీటీ రిలీజ్‌ల అసలు బాగోతం!

ఓటీటీ రిలీజ్‌ల అసలు బాగోతం!

Reason Behind OTT Release

టాలీవుడ్‌లో భారీ చిత్రాలను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తూ తమ సత్తా చాటుతారు బడా నిర్మాతలు. ఇక చిన్న సినిమాలను వీలైనన్ని థియేటర్లలో రిలీజ్ చేసి సక్సెస్ కొట్టాలని చిన్న నిర్మాతలు నానా తంటాలు పడుతారు. ఇది కొన్నేళ్లుగా వస్తున్నా దీనిపై ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే టాలీవుడ్‌లోని కొందరు బడా నిర్మాతల కనుసైగల్లోనే ఈ పనులు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో సినిమా రిలీజ్‌ల విషయంలో నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కొందరు నిర్మాతలు పూర్తిగా నష్టపోకుండా తమకు వచ్చిన ఆఫర్లకే ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అయితే కేవలం చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఒక్క పెద్ద సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ వ్యవహారం వెనకాల కూడా బడా నిర్మాతలు ఉన్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చిన్న నిర్మాతలు తెరకెక్కించిన సినిమాలు బాగున్నా, వాటి కోసం తీసుకున్న అప్పు కారణంగా నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేలా ఫైనాన్షియర్ల వెనకాల బడా నిర్మాతలే ఈ తతంగం చేస్తున్నారు.

థియేటర్లు తెరుచుకున్న సమయానికి తమ సినిమాలకు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు పోటీ కాకూడదనే ఉద్దేశ్యంతోనే వారు ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. కానీ ఎవ్వరు నోరుమెదపరు. అంతలా సినీ ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్న కొందరు బడా నిర్మాతలు చేస్తున్న బాగోతమే ఈ ఓటీటీ రిలీజ్‌లు. మరి ఇలాంటి రిలీజ్‌లకు ఎప్పుడు చెక్ పడుతుందో, తమ సినిమాలను ఎప్పుడు థియేటర్లలో రిలీజ్ చేస్తామో అని కొందరు చిన్న నిర్మాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad