
మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను వేసవి కానుకగా మే 8న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, ఇందులో రవితేజ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు ఎంతో ఆక్తిగా చూస్తున్నారు. కానీ క్రాక్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని చిత్ర యూనిట్ ముందు నుండీ చెబుతూ వస్తోంది.
ఏది ఏమైనా ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, మాస్ రాజా యాక్షన్‌ను ఖచ్చితంగా వెండితెరపైనే చూడాలని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని వారు అంటున్నారు. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా సముథ్రికరన్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్‌కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.