Home టాప్ స్టోరీస్ మాస్ మహారాజ్ సంచలన నిర్ణయం

మాస్ మహారాజ్ సంచలన నిర్ణయం

jpg 1 5

లాక్ డౌన్ తో మూవీ థియేటర్లు, మల్టీ ప్లెక్స్ లు పూర్తిగా మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయే చెప్పడం దాదాపు అసాధ్యం. మరోవైపు కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ప్రజలు కూడా భయం భయంతో గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్లో తెరిచిన ప్రేక్షకులు వచ్చే అవకాశం స్వల్పం. 50 శాతం ప్రేక్షకులతో థియేటర్లు నడిపించడం కూడా అసాధ్యం. అందుకే మెజారిటీ హీరోలు ఓటిటి పై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఓటిటి హవా నడుస్తోంది. గత నాలుగు నెలల్లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ష్ వ్యువార్ షిప్ దాదాపు 60 శాతం పెరిగింది. ప్రజలు కూడా ఇంటి వినోదానికే ఆసక్తి కనబరుస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మూవీ హీరోలు కూడా అప్ డేట్ అవుతూ వస్తున్నారు.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజ్ ఓటిటిల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే  దీనికి సంబంధించిన హింట్స్ ను డైరెక్టర్లకు రవితేజ అందించాడట. కథ నచ్చితే ఏ ప్లాట్ ఫాంలో అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు రవితేజ ప్రకటించారని ఇండస్ట్రీ లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో నటించిన రెమ్యూనీరేష‌న్ లో మాత్రం త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా సమాచారం.

ఇప్పటికే తమిళ హీరో సూర్య  ఓటిటిలతో ఎగ్రీమెంట్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు. సమంత కూడా ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. అగ్ర హీరోలు అందరు ఓటిటి వైపు అడుగులు వేస్తుంటే మాస్ మ‌హారాజ్ కూడా ట్రెండ్ కి త‌గ్గ‌ట్లుగా త‌న కెరీర్ ని మార్చుకోవ‌డానికి ట్రై చేస్తున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad