
టాలీవుడ్లో అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా ట్రెండ్ సెట్టర్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ ఒక్క సినిమా సినిమాతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యే ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ఈ హీరో. ఇక ఆ తరువాత మనోడు చేసిన గీతాగోవిందం చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.
కాగా గీతాగోవిందం చిత్రం తరువాత మరోసారి ఈ జోడీ డియర్ కామ్రేడ్ చిత్రంలో కలిసి పనిచేశారు. అయితే ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ సినిమా రిలీజ్ తరువాత ఆ అంచనాను అందుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత మళ్లీ విజయ్ దేవరకొండ, రష్మికలు కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు మరోసారి వారిద్దరు కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి వారిద్దరు కలిసి కనిపించేది సినిమా కాదండోయ్.

ఓ యాడ్ కోసం విజయ్ దేవరకొండతో పాటు రష్మిక కలిసి నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒక బట్టల బ్రాండ్ యాడ్ కోసం రష్మిక పేరును విజయ్ దేవరకొండ రికమెండ్ చేశాడట. దీంతో సదరు నిర్వాహకులు రష్మికను ఈ యాడ్‌లో నటించేందుకు ఒప్పించారని తెలుస్తోంది. మొత్తానికి యాడ్ రూపంలోనైనా విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మరోసారి కనిపిస్తుండటంతో రౌడీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ చిత్రంలో నటిస్తుండగా, రష్మిక ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోంది.