Home సినిమా గాసిప్స్ రష్మికకు కోలీవుడ్ షాక్.. ఎంట్రీలోనే ఎగ్జిట్‌కు దారి?

రష్మికకు కోలీవుడ్ షాక్.. ఎంట్రీలోనే ఎగ్జిట్‌కు దారి?

Rashmika Mandanna Kollywood Entry In Dilemma

కన్నడ బ్యూటీ రష్మిక మందన తెలుగులో ‘ఛలో’ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సె్స్ అయిన రష్మిక, ఆ తరువాత ‘గీతాగోవిందం’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతుంది ఈ బ్యూటీ. కాగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో స్టార్ హీరోల సరసన నటించే హీరోయిన్‌గా మారిపోయింది.

ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ, తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. తమిళ హీరో కార్తీ నటిస్తున్న ‘సుల్తాన్’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన రష్మికకు, కోలీవుడ్ ఎంట్రీ అంత సులభంగా లేదని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న సుల్తాన్ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను వేశారు చిత్ర యూనిట్. మెజారిటీ శాతం షూటింగ్ అక్కడే నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది.

దీంతో పాటు ఇటీవల చెన్నైలో కురిసిన వర్షాలకు ఆ సెట్ పూర్తిగా పాడైపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కావడంతో ఫైనాన్షియర్ చేతులెత్తేశాడట. దీంతో మళ్లీ సెట్ వేసి సినిమా షూటింగ్ నిర్వహించాలంటే వేరొక ఫైనాన్షియర్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాలంటే ఇప్పుడు తప్పనిసరిగా ఫైనాన్షియర్ అవసరం ఉండటంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందో లేదో అనే డైలామా పడిందట చిత్ర యూనిట్. మొత్తానికి రష్మిక కోలీవుడ్ ఎంట్రీపై కరోనాతో పాటు వర్షాలు కూడా పగబట్టినట్లు తెలుస్తోంది. మరి ఆమె తమిళ ఎంట్రీకి ఎవరు సాయం చేస్తారో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad