Home సినిమా గాసిప్స్ ఆ డైరెక్టర్‌ను బుట్టలో వేసుకున్న రష్మి?

ఆ డైరెక్టర్‌ను బుట్టలో వేసుకున్న రష్మి?

Rashmi To Act In Koratala Siva Movie

టాలీవుడ్‌లో బుల్లితెర నుండి వెండితెరకు వచ్చి తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నవారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఒకరు. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోలో హాట్ అందాలతో ప్రేక్షకులను అల్లాడించిన ఈ బ్యూటీ, అదే అందాల ప్రదర్శనతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే కేవలం గ్లామర్ డోస్ తప్ప అమ్మడిలో మ్యాటర్ లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు ఆమె సినిమాలను తిరస్కరించారు.

దీంతో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు రష్మీ రెడీ అవుతోంది. అయితే ఈసారి ఓ టాప్ డైరెక్టర్‌తో ఆమె రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. గతంలో మరో హాట్ యాంకర్ అనసూయకు సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్ర అదిరిపోయే క్రేజ్‌ను తీసుకువచ్చింది. అలాగే మరో యాంకర్ హరిప్రియకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ ఆ’ చిత్రం మంచి గుర్తింపునిచ్చింది. ఇప్పుడు వారిలాగే తనకు కొరటాల శివ తెరకెక్కించబోయే సినిమా మంచి కమ్‌బ్యాక్‌ను ఇస్తుందని రష్మీ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది.

అయితే కొరటాల తెరకెక్కి్స్తున్న ‘ఆచార్య’ చిత్రంలో రష్మీకి ఈ అవకాశం లేదని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కొరటాల తెరకెక్కించబోయే నెక్ట్స్ ప్రాజెక్టులో రష్మీకి అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారట. కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో ఉన్న మంచి రిలేషన్ కారణంగానే రష్మీకి ఈ ఆఫర్ లభించినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా వెండితెరపై మరోసారి తన సత్తా చాటేందుకు రష్మీ రెడీ అవుతోందని చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad