Home సినిమా దొంగ పెళ్లి చేసుకోను.. రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన.. రేణు దేశాయ్..!

దొంగ పెళ్లి చేసుకోను.. రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన.. రేణు దేశాయ్..!

రేణుదేశాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకొని ప్రస్తుతం పిల్లలతో కలిసి మహారాష్ట్రలో జీవనం కొనసాగిస్తున్నారు. ఒక వైపు పిల్లల బాధ్యత ను తల్లి గా నెరవేరుస్తూనే, మరో వైపుగా మరాఠి సినిమాల పై దృష్టి సారించింది. రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకొనుటకై.. గత సంవత్సరము నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఈ విషయాన్ని పవన్ మాజీ భార్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగి ఇన్ని రోజులైనా పెళ్లి ప్రస్తావన రావట్లేదని అప్పట్లో గుసగుసలు మొదలయ్యాయి. వాటన్నింటికి ఫుల్స్టాప్ పెట్టేసింది రేణు. తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. కాబోయే భర్త గురుంచి ఆసక్తికరమైన విషయాలను చెప్పింది.

నటి రేణు దేశాయ్ ఈటీవీలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా.. షో కి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యాంకర్ అలీ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. ఆమె పెళ్లిపై అభిమానులలో వ్యక్తమవుతున్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చేసింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ “నేను పెళ్లి చేసుకోవాలని పూర్తిగా నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాతే గత ఏడాది జూన్ మాసంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. త్వరలోనే వివాహ తేదీని కూడా ప్రకటిస్తాను. నేను దొంగ పెళ్లి మాత్రం చేసుకోను. అందరికి తెలియ చెప్పి నా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికే నాకు నిశ్చితార్థం జరిగిందని ప్రపంచానికి తెలుసు. అప్పట్లో ఈ విషయం పై నానా హంగామా జరిగింది. అందుకే పెళ్లి గురించి మరిన్ని వివరాలు తెలియ చేయలేను. తప్పకుండా అందరికీ చెప్పి ఘనంగా వివాహము చేసుకుంటాను. ఇదంతా నా కుటుంబ ఆమోదం మేరకు జరుగుతుంది”. అని తెలిపారు.

చివరగా కాబోయే భర్త గురుంచి అడగగా వివరాలను కొంతవరకు పంచుకుంది. రేణు కాబోయే భర్త పూణెలో ఒక ఐటీ కంపెనీ డైరక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. పూణే కంపెనీ కి రాకమునుపు అమెరికాలో జాబ్ చేసేవాడట. కుటుంబ కారణాల వలన పూణే కి వచ్చేశాడంటూ చెప్పింది.. కానీ ఎంతడిగిన పేరు మాత్రం ఇప్పుడప్పుడే చెప్పానంటూ జాగ్రత్త వహించింది. నిశ్చితార్థం సమయాన పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ను దృష్టిలో పెట్టుకొని.. పేరు చెప్పకుండా తప్పించుకుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad