Home సినిమా రానాను వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు..!

రానాను వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు..!

భల్లాలదేవ రానా బాహుబలితో ఇమేజ్ తెచ్చుకున్నాడు. అంత రేంజ్ లో సినిమా తీశాక, రానా కూడా మళ్లీ అదే రేంజ్ లో సినిమా దొరకాలని ఎదురుచూస్తున్న సమయంలో రానా రాకను కోరుతూ జాతీయ స్థాయి ప్రాజెక్ట్స్ క్యూ లో నిలుచున్నాయి. బాహుబలి అనంతరం హాథీ మేరి సాథీ, 1945, హౌస్ఫుల్ 4 చిత్రాల్లో నటిస్తున్నాడు. అభిమానులంతా రానా సినిమా కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. కానీ ఆయన ఆర్థిక పరిస్థితులు బాగోలేవని వార్తలొస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే 1945 చారిత్రాత్మక నేపథ్యం గల చిత్రంగా రూపొందుతుంది. కే ప్రొడక్షన్ బ్యానర్ పై, సత్య శివ దర్శకత్వంలో నిర్మాణం పొందుతున్న ఈ సినిమాలో రానా సరసన రెజీనా కాసాండ్రా నటిస్తుంది. నాజర్, సత్యరాజ్ తదితర నటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయాలనీ నిర్ణయించుకోగా డబ్బుల కొరత ఏర్పడిందట. 50 శాతం పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిందట.

రానా సినిమాకి ఫండ్స్ సేకరించే దిశగా ఉన్నారని, చేతికి డబ్బు చిక్కగానే సినిమా పనులు పూర్తి చేసి తెరకెక్కించాలని అనుకుంటున్నారట. హాథీ మేరి సాథీ చిత్రం కూడ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆగిపోయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. చివరగా హౌసేఫుల్ 4 చిత్ర షూటింగ్ లో రానా బిజీగా ఉన్నారు. అలాగే రానా దగ్గుబాటి హౌసేఫుల్ 4 చిత్రం తర్వాత తెలుగులో ఒక సినిమాకి ఓకే చెప్పారట. వేణు ఊడుగుల దర్శకత్వం వహించే సినిమాలో రానా పక్కన సాయిపల్లవి నటించనున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad