Home టాప్ స్టోరీస్ పెళ్లికి రాని వారిని కూడా వదలని రానా.. ఏం చేశాడో తెలుసా?

పెళ్లికి రాని వారిని కూడా వదలని రానా.. ఏం చేశాడో తెలుసా?

Rana Daggubati Sending Gifts To Celebrities

యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బ్యాచ్‌లర్ జీవితానికి గుడ్‌బై చెబుతూ మిహికా బజాజ్ అనే అమ్మాయిని కుటుంబ సభ్యుల సమక్షంలో రానా వివాహమాడాడు. అయితే రానా పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని దగ్గుబాటి ఫ్యామిలీ ఎంతో ప్రయత్నించింది. కానీ కరోనా వైరస్ కారణంగా పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాల్సి వచ్చింది. ఇక రానా, మిహికాల పెళ్లికి చాలా మంది సెలబ్రిటీలు హాజరు కాలేకపోయారు.

దీంతో రానా దగ్గుబాటి తన పెళ్లికి రాని వారికి షాకిచ్చే పని చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా తమ కొత్తజంటను దీవించేందుకు రాలేకపోయినా, వారి ఆశీర్వాదాలను కోరుతూ పలువురికి బహుమతులు పంచుతున్నాడు. ఇప్పటికే రానా పంపించిన బహుమతులు పలువురు సెలబ్రిటీలు అందుకోగా, వారు రానా దగ్గుబాటికి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెళ్లికి వచ్చినవారితో పాటు పెళ్లికి రాని వారికి కూడా రానా బహుమతులు ఇస్తుండటంతో ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక రానా-మిహికాల వివాహం లాక్‌డౌన్ కారణంగా చాలా సింపుల్‌గా జరగడంతో దగ్గుబాటి అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కాగా రానా పెళ్లి చేసుకున్నాక తన నెక్ట్స్ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని రెడీ అవుతున్నాడట. అయితే ఇప్పట్లో సినిమా షూటింగ్‌లలో పాల్గొనేందుకు స్టార్స్ ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంతో రానా ఎప్పుడు పాల్గొంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad