
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకుంది. కాగా ఈ సినిమా పూర్తికాక ముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ బాటలో పయనించేందుకు మరో తెలుగు హీరో కూడా రెడీ అవుతున్నాడు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో, ఆయన మిహికా బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన కొత్త జీవితాన్ని ప్రారంభించిన రానా, ఇప్పుడు సినిమాలపై తిరిగి ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం అరణ్యను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు రానా రెడీ అవుతున్నాడు. కాగా తమిళ డైరెక్టర్ మిలింద్ రావు తాజాగా రానాకు ఓ కథను వినిపించాడట. ఈ దర్శకుడు గతంలో ‘గృహం’ అనే సినిమాతో బాక్సాఫీస్‌ను భయపెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన వినిపించిన కథకు రానా ఓకే చెప్పడంతో వీరిద్దరి కాంబోలో రాబోయే కథ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
గతంలో ప్రభాస బాహుబలి చిత్రంలో రానా కూడా నటించడంతో వారిద్దరికీ అదిరిపోయే గుర్తింపు వచ్చింది. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో సోలోగా వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. మరి అరణ్య చిత్రంతో రానా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా, మిలింద్ రావుతో చేయబోయే సినిమాపై దాని ప్రభావం ఎంతమేర ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.