Home సినిమా టాలీవుడ్ న్యూస్ రేసులో వెనుకబడ్డ చెర్రీ...కారణం ఏంటి ?

రేసులో వెనుకబడ్డ చెర్రీ…కారణం ఏంటి ?

Ramcharan dietplan sumantv

టాలీవుడ్ లో టాప్ చెయిర్ ను అందుకోవడం కోసం యువ హీరోలు మధ్య గట్టి పోటీ ఉంటుందని విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. వీళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీసును రఫ్ఫాడిస్తా ఉంటాయి. 2020 ప్రథమార్ధంలో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోగా, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో రికార్డు మోత మోగించారు. దీంతో వీరిద్దరి మధ్య టాప్ కాంపిటేషన్ ఏర్పడింది. అయితే వీరిద్దరూ బాహుబలి మరియు సాహో రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు.

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. సౌత్ ఇండియాలో కూడా ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునే అందర్ని ఆశ్చర్యానికి గురిచేసాడు. ప్రభాస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరుస సినిమాలకు శ్రీకారం చూడుతున్నారు. ఇప్పుడు వీళ్ళతో పోలిస్తే రాంచరణ్ రేస్ వెనకబడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో `రౌద్రం రణం రుధిరం` మినహా మరొక సినిమా లేదు. కానీ ప్రభాస్ చేతిలో నాగ్ అశ్విన్, ఓం రౌత్ లతో పాన్ ఇండియా సినిమా ఉండగా, ఎన్టీఆర్ త్రివిక్రమ్- కొరటాల- ప్రశాంత్ నీల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇతర హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ మాత్రం ఎటువంటి సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడంలేదు. రంగస్థలం తర్వాత విడుదలైన వినయ విధేయ రామ ఘోర పరాజయం చెందడంతో రాంచరణ్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. రాజమౌళి తర్వాత ఆ స్థాయి సినిమానే చేయాలని రామ్ చరణ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే అంత వరకు మరో సినిమాను ప్రారంభించుకూడదని చెర్రి యోచిస్తున్నట్టు ఇండస్ట్రీలు జోరుగా ప్రచారం సాగుతోంది. ఏదేమైనప్పటికీ చెర్రీ రేసులో వెనకబడ్డాడు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad