Home సినిమా గాసిప్స్ త్రివిక్రమ్‌ను లైన్‌లో పెడుతున్న ఇస్మార్ట్ హీరో

త్రివిక్రమ్‌ను లైన్‌లో పెడుతున్న ఇస్మార్ట్ హీరో

Ram Pothineni In Line For Trivikram

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పి్స్తూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కాగా ఈ డైరెక్టర్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడంతో త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించాడు. యంగ్ టైగర్ తారక్ 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ ఇప్పటికే అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. అయితే తారక్ నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రం మరింత ఆలస్యం అవుతుండటంతో, త్రివిక్రమ్ చిత్రం ఇప్పట్లో మొదలవుతుందో లేదో అనే సందేహం నెలకొనడంతో త్రివిక్రమ్ డైలమాలో పడ్డాడట. కాగా ఈ క్రమంలోనే తారక్‌తో సినిమా స్టార్ట్ చేసే లోపు ఓ చిన్న బడ్జెట్ సినిమాను తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే పలువురు యంగ్ హీరోలు ఆయనతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే నిర్మాత స్రవంతి రవికిషోర్ త్రివిక్రమ్‌ను రామ్ కోసం ఓ కథను రెడీ చేయాలని కోరాడట. గతంలోనే త్రివిక్రమ్‌తో రామ్ నటించాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు రామ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మరి ఈ సినిమా ఈసారైనా ఫిక్స్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad