Home టాప్ స్టోరీస్ మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

thumb 2

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి ఓ యదార్థ సంఘటనను తెరకెక్కించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాడు. 2019 యావత్ భారత దేశాన్ని కుదిపేసిన దిశా ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. 2019 నవంబర్ 26న హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలి పై కొంతమంది వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. ఆ తర్వాత పోలీసులు ఎన్ కౌంటర్ లో వారు మరణించారు. అప్పట్లో ఈ సంఘటన పై స్పందించిన రాంగోపాల్ వర్మ దీనిపై సినిమా తీస్తానని ప్రకటించాడు. ఇప్పుడు ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సంఘటన జరిగిన నవంబర్ 26న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కొన్ని సున్నితమైన అంశాలు ఉండటంతో లీగల్ యాక్షన్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమా పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సినిమా షూటింగ్ నిలిపివేయవలిసిందిగా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులోఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. సాధారణంగా రాంగోపాల్ వర్మ తీసే బయోపిక్ సినిమాల్లో సదరు వ్యక్తుల వ్యక్తుల అనుమతి లేకుండానే ఫోటోలు, వీడియోలు వినియోగించడం సర్వసాధారణంగా జరుగుతుంది.

ప్రస్తుతం వర్మ ప్లాన్ చేస్తున్న దిశ సినిమా చాలా సున్నితమైన అంశంతో పాటు ఎంతోమంది భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అటువంటి అంశాన్ని తెరకెక్కించడం అంటే వివాదాలను కొని తెచ్చుకోవడమే. మరోవైపు వర్మ తన సొంత బయోపిక్ అవసరమైన స్టోరీని రెడీ చేస్తున్నట్టు సమాచారం. మూడు భాగాలు గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ జీవితంలోని వివాదాలు, సినిమా జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఉండనున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad