దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , జూనియర్ ఎన్టీఆర్ కొమరం బీమ్ పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి సరసన బాలీవుడ్ భామ అలియా భట్ , హాలీవుడ్ అమ్మడు ఎడ్గర్ జోన్ నటిసున్నారు. సినిమా షెడ్యూల్ పక్కగా ప్లాన్ వేసుకొని నార్త్ ఇండియాకు వెళ్లారు చిత్ర యూనిట్. 45 రోజుల పాటు షెడ్యూల్ బిజీ చేసేసుకున్నారు టీం. అహ్మదాబాద్, ముంబై, పూణే, మహారాష్ట్ర ఇలా కొన్నిప్రదేశాలలో చిత్రీకరణ చేయనుండగా ఊహించని షాక్ కి గురయ్యారు. తారక్, రామ్ ఎన్నికల వేడికి దూరంగా ఉన్నారనుకునే లోపే అభిమానులకు షాకింగ్ న్యూస్ ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు RRR టీమ్ .
రాజమౌళి వడోదరలో షూటింగ్ చేయనుండగా.. నిన్న ఉదయం రామ్ చరణ్ జిమ్ చేస్తున్నపుడు అనుకోకుండా మడిమ కు దెబ్బ తగిలింది. వెంటనే డాక్టర్స్ కి చూపించగా కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని తెలియ చేశారట. అంతే ఇక ఒక్క రోజు కూడా వాయిదా వేయకుండా.. వేసుకున్న షెడ్యూల్ కి బ్రేక్స్ పడ్డాయి. ఇక మెగా పవర్ స్టార్ కి గాయం అవడంతో పూణే లో చేయాల్సిన రామ్ చరణ్ షూటింగ్స్ వాయిదా వేసి నందమూరితో చేయవల్సిన సన్నీవేశాలను మాత్రం చిత్రీకరించాలని దర్శక ధీరుడు అభిప్రాయం పడుతున్నారట. ఈ కారణంగానే ఎన్టీఆర్ అక్కడే ఉన్నారని తాజా సమాచారం. రామ్ హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు రామ్ చరణ్ తీసుకునే రెస్ట్ లో .. ఎన్నికలు కూడా ఉన్నాయి. అబ్బాయి బాబాయ్ కి ఏ పరమైన సపోర్ట్ ఇస్తాడో చూడాలి.