Home సినిమా ఆయనలా ఫిట్ గా ఉండాలంటే ఏం చేయాలి?

ఆయనలా ఫిట్ గా ఉండాలంటే ఏం చేయాలి?

సినిమా హీరోలు అంటే చాలా ఫిట్ గా, చక్కని శరీరాకృతిని కలిగి ఉండాలి. లేదంటే వాళ్ళని అస్సలు పట్టించుకోరు. ఇంత పెద్ద పొట్టేసుకుని, నెత్తి మీద బొచ్చు రాలిపోయి, అంకుల్ లా కనబడితే ఎవరు మాత్రం చూస్తారు. అలా అని మరీ సన్నగా డొక్కులా కనబడినా హీరో అనరు, జీరో అంటారు. అందుకే హీరోలు ఫిట్ నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఎక్కువగా తింటే పొట్ట వచ్చేస్తుందని ఒక బాధ, అస్సలు తినకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని మరొక బాధ. ఇలాంటి బాధల మధ్య నలిగిపోతూ డైట్ ని పాటించడం అంటే మామూలు విషయం కాదు. ముప్పై ఏళ్ళు వస్తే చాలు కింద పొట్ట వచ్చేస్తుంది. అలాంటిది నలభై, యాభై ఏళ్ళు వచ్చినా మహేశ్, నాగార్జున లాంటి హీరోలు ఫిట్ గా ఉంటున్నారంటే దానికి కారణం వాళ్ళు చేసే డైటే.

ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఐతే డైట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. అలాంటి చరణ్ “వినయ విధేయ రామ” మూవీ కోసం డైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. అందుకే ఈ మూవీలోని కొన్ని సీన్స్ లో, పర్ఫెక్ట్ ఫిజిక్ తో కనిపిస్తారన్న విషయం ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఈ సీన్స్ లో చరణ్ తన ఒంటిపై టాటూలతో అదిరిపోయే ర్యాంబో లుక్ లో కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే చరణ్ లానే ఈ లుక్ మెయిన్ టెయిన్ చేయాలంటే అభిమానులు ఏం చేయాలి? చరణ్ లా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కనిపించాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలకు సమాధానంగా ఉపాసన చరణ్ డైటింగ్ సీక్రెట్ ను బయటపెట్టారు.

ఈ డైట్ ను చరణ్ ఫ్యాన్స్ ఫాలో ఐతే కనుక వాళ్ళు కూడా చరణ్ లుక్ లోకి మారిపోవచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు. చరణ్ మాదిరిగా శరీరాన్ని ఫిట్‌ గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లెయిన్ తో పాటు క్రమం తప్పకుండా చరణ్ తీసుకున్న డైట్ కూడా చాలా అవసరం అని అంటున్నారు ఉపాసన. ‘వినయ విధేయ రామ’ లోని లుక్ కోసం చరణ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు 3 ఎగ్ వైట్స్, 2 ఫుల్ ఎగ్స్, 3/4 కప్ ఓట్ మీల్ విత్ ఆల్మండ్ మిల్క్ తీసుకునేవారు. ఇక ఉదయం 11.30 గంటలకు ఒక పెద్ద కప్పు నిండా కూరగాయల సూప్ తీసుకునేవారు. మధ్నాహ్నం 1.30 గంటలకు 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్, అందులో ముప్పావు వంతు బ్రౌన్ రైస్, అరకప్పు గ్రీన్ వెజిటబుల్ కర్రీ తినేవారు. సాయంత్రం 4 గంటలకు 250 గ్రాముల గ్రిల్డ్ ఫిష్, 200 గ్రాముల స్వీట్ పొటాటో, అరకప్పు గ్రీన్ వెజిటబుల్ తీసుకునేవారు. సాయంత్రం 6 ఐతే, గ్రీన్ సలాడ్, అవాకాడో, నట్స్ తినేవారు. ఫిట్‌ నెస్ ట్రైనర్ రాకేష్ ఉదియార్ నేతృత్వంలో చరణ్ చాలా క్రమపద్ధతిలో ఈ డైటింగ్ తీసుకున్నారు. అందుకే చరణ్ ఇంత ధృఢంగా ఉన్నారు.

సో, మీరు కూడా ఈ డైట్ ని పాటిస్తే చరణ్ లా ధృఢంగా ఉండచ్చునని ఉపాసన అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చరణ్ లోని డెడికేషన్, డిసిప్లెయిన్ తో పాటు డైట్ టిప్స్ ని కూడా ఫాలో అవ్వండి. రామ్ చరణ్ అంత కాకపోయినా, మినిమమ్ ధృఢమైన శరీరాన్ని పొందచ్చు. ఏది ఏమైనా గాని ఇష్టమైన ఫుడ్ ఇష్టమొచ్చినట్టు తినకుండా నోరు కట్టుకుని ఉండడం అంటే మామూలు విషయం కాదు. అందుకే కదా వీళ్ళని హీరోలనేది. మరి చరణ్ లాంటి ఫిజిక్ పొందేందుకు ఉపాసన ఇచ్చిన డైటింగ్ సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలానే ఈ డైట్ సీక్రెట్ ను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad