Home సినిమా ఐకాన్‌గా మారుతున్న చరణ్..?

ఐకాన్‌గా మారుతున్న చరణ్..?

icon thumb

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు ఈ హీరో. పుష్ప అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ చాలా మాస్ లుక్‌లో కనిపించనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో తెలుస్తోంది.

అయితే అల వైకుంఠపురములో సినిమా కంటే ముందే బన్నీ ఓ సినిమాను ఓకే చేశాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఐకాన్ అనే సినిమాను బన్నీ గతంలోనే తెరకెక్కించాలని చూశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో త్రివిక్రమ్ సినిమా తరువాత ఐకాన్ వస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఇప్పుడు పుష్ప సినిమాను తెరకెక్కిస్తుండటం, ఆ తరువాత కొరటాల శివతో తన నెక్ట్స్ మూవీలను లైన్‌లో పెట్టడంతో ఐకాన్ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆ సినిమాను మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తు్న్నాడు. ఇప్పటికే చరణ్‌తో ఈ సినిమాకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరిపాడట. అయితే చరణ్ మాత్రం ఈ సినిమా చేసేది లేనిది అనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదట. మరి బన్నీ ఐకాన్ చిత్రాన్ని చరణ్ చేస్తాడా లేడా అనేది చూడాలి. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న చరణ్, ఆ తరువాత ఆచార్య చిత్రంలో కేమియో పాత్రలో నటించనున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad