Home సినిమా గాసిప్స్ చరణ్‌కు అలాంటి సినిమా చేయాలనుందా..?

చరణ్‌కు అలాంటి సినిమా చేయాలనుందా..?

Ram Charan Interested In Sports Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటివరకు చరణ్ ఓకే చేయలేదు.

కాగా నిర్మాతగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాతే తన నెక్ట్స్ మూవీని రెడీ చేయాలని చరణ్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు ఎలాంటి సినిమా చేయాలని ఉందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనకు ఎప్పటినుండో ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాలని కోరికగా ఉందని చరణ్ తెలిపాడు. దీంతో చరణ్‌కు ఎలాంటి ప్రాజెక్ట్‌పై ఎక్కువ మక్కువ ఉందో ఇప్పుడు తెలిసిపోయింది.

మరి చరణ్ కోరికను ఏ డైరెక్టర్ తీరుస్తాడా, ఆయన కోసం అదిరిపోయే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథను ఎవరు రెడీ చేస్తారా అనేది ప్రసుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికే యంగ్ హీరో నాగశౌర్య తన 20వ చిత్రంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రంతో వస్తుండటంతో, తనకు కూడా వీలైనంత త్వరగా ఇలాంటి సినిమా చేయాలని ఉందంటూ చరణ్ చెప్పుకురావడం విశేషం. కాగా చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో మరో హీరోగా ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad