Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఆచార్యలో చరణ్ ఎపిసోడ్స్ పీక్స్!

ఆచార్యలో చరణ్ ఎపిసోడ్స్ పీక్స్!

Ram Charan Episode In Acharya To Be Highligh

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే 40 శాతం పూర్తి చేశారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా కొరటాల శివ తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో కనిపిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో చరణ్ చేయబోయే పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్‌లో చరణ్ ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో వచ్చే చరణ్ ఎపిసోడ్ సినిమాకు చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ కేమియో పాత్ర ఏకంగా 25 నిమిషాల పాటు ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా కథను మలుపు తిప్పేలా చరణ్ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన ఓ హీరోయిన్ కూడా ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ పాత్ర కోసం కీర్తి సురేష్, కియారా అద్వానీ లాంటి పేర్లు ఇప్పటికే వినిపించాయి. ఇక ఈ సినిమా కథ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే అక్రమాల గురించి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad