Home సినిమా పూరితో రామ్ చరణ్ ! ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్

పూరితో రామ్ చరణ్ ! ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్

Puri Jagannath Ramcharan

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో భారీ హిట్లు అందుకున్న ఈ దర్శకుడు గత కొంత కాలంగా ఫ్లాప్స్తో సతమతమవుతూ ఉన్నాడు. చాలా మంది విమర్శకులు ఈ డైరెక్టర్ పని అయిపోయింది అనుకున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ తో తిరుగు లేని విజయాన్ని అందుకున్నాడు పూరి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించి,దాదాపు 60 కోట్లకు పైగా షేర్ ను రాబట్టి పూరి స్టామినా ఎంటో టాలీవుడ్ కు మరోసారి పరిచయం చేసింది. దీనితో ఫ్లాప్ డైరెక్టర్ అనే నిద్ర చెరిగిపోయింది.

దీని తరువాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. పూరి జగన్నాథ్ కు మెగా ఫ్యామిలీకి దగ్గర సంభంధం ఉంది. మొదట పవన్ కళ్యాణ్ బద్రి మూవీ తో కెరీరును ప్రారంభించింది పూరిజగన్నాథ్ డైరెక్షన్ లోనే. ఈ సినిమా భారీ విజయం కావడంతో చిరు రామ్ చరణ్ లాంచింగ్ ను పూరి జగన్నాథ్ చేతులు పెట్టాడు. చిరుత సినిమా కూడా మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. అప్పటినుండి మెగా ఫ్యామిలీకి పూరికి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.

చిరు తిరిగి మూవీస్ లోకి ప్రవేశించే సమయంలో పూరి సినిమా ద్వారానే రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. చిరు కోరిక మేరకు పూరి “ఆటో జానీ” అనే కధను సిద్దం చేశారు కూడా అయితే తర్వాత కథ నచ్చక పోవడంతో చిరు ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసి ఖైదీనెంబర్150 తో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం పూరి సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. తాజాగా పూరి జగన్నాథ్ రామ్ చరణ్ కోసం ఒక మాస్ మసాలా కధ సిద్దం చేశారని తెలుస్తంది. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూరి జగన్నాథ్ రైటింగ్ లో కొత్త రకంగా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం కథ చర్చలు స్థాయిలో ఉంది. రాజమౌళి సినిమా తర్వాత చరణ్ ఒక భారీ సినిమాలో నటించాలని అనుకుంటున్నారు. చిరు ఫ్యామిలీతో పూరికున్న సంబంధాల కారణంగా ఈ సినిమా పట్టాలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ చిత్రాన్ని కె.ఎస్.రామారావు నిర్మిస్తుండగా వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే గనుక నిజమైతే చెర్రి ఫ్యాన్స్ కు మరో మాస్ సినిమా దొరికినట్టే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad