Home టాప్ స్టోరీస్ రిస్క్ చేస్తున్న క్రిష్:షూటింగ్ స్టార్ట్

రిస్క్ చేస్తున్న క్రిష్:షూటింగ్ స్టార్ట్

Krish Director Images 1 1 1280x720 1

కరోనా లాక్ డౌన్ కారణంగా గత 150 రోజులకు నిలిచిపోయిన షూటింగ్స్, తాజా కేంద్ర మార్గదర్శకాలతో మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో షూటింగ్స్ హడావిడి మొదలయ్యింది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా షూటింగ్ ఆగస్టు 31న ప్రారంభ౦ కాగా షూటింగ్ లో మూవీ మొత్తం పాల్గొంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవి తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అఫీషియల్ వికారాబాద్ ఫారెస్ట్‌లో ప్రారంభమైంది.

క్రిస్ జాగర్లమూడి ఈ సినిమా కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాను ఒకే ఒక షెడ్యూల్ లో పూర్తి చేస్తానని ప్రకటించారు. ఆ షెడ్యూల్ కేవలం 40 రోజులు మాత్రమే ఉండనుంది. కరోనా నేపథ్యంలో చిత్రాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందించగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వాస్తవానికి క్రిష్ ఈ సినిమాకు ముందే పవన్ కళ్యాణ్ తో విరూపాక్ష అనే సినిమాను తెరకెక్కించవలసి ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో ఒక చిన్న సినిమాను తెరకెక్కించాలని క్రిష్ అనుకున్నారట. అందుకే ఈ సినిమాను ప్రారంభించినట్టు సమాచారం. లాక్‌డౌన్‌ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌ను క్రిష్ తిరిగి ప్రారంభిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పిక్చర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad