Home సినిమా కరణం మల్లేశ్వరి బయోపిక్ కోసం రకుల్..?

కరణం మల్లేశ్వరి బయోపిక్ కోసం రకుల్..?

Rakul Preet Singh In Karanam Malliswari Biopic

టాలీవుడ్‌లో ఇటీవల బయోపిక్ చిత్రాల హవా పెరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి వంటి లెజెండరీ నటుల బయోపిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. కాగా ఈ క్రమంలో తాజాగా వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్ కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు టాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ రైటర్ కమ్ నిర్మాత కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఈ బయోపిక్ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం చాలా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ బయోపిక్‌లో స్టార్ బ్యూటీ అనుష్క నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అవేమీ నిజం కాదని ఆమె కుండ బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ బయోపిక్‌లో మరో బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరణం మల్లేశ్వరి బయోపిక్‌లో నటించే హీరోయిన్ చాలా ఫిట్‌గా ఉండాలి. దీంతో టాలీవుడ్‌లో అంత ఫిట్‌గా ఉండే హీరోయిన్‌గా రకుల్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కొంత బరువు పెరిగితే రకుల్ ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి ఈ బయోపిక్‌లో రకుల్ హీరోయిన్‌గా నటిస్తుందో లేదో చూడాలి అంటున్నారు చిత్ర వర్గాలు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి ప్రెస్టీజియస్ బయోపిక్ చిత్రంలో రకుల్ నటిస్తుందనే వార్తతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad