
టాలీవుడ్లో కెరటం చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ సినిమా నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది ఈ బ్యూటీ. కాగా దాదాపు అందరు యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ, ఇటీవల టాలీవుడ్లో ఆఫర్లు లేక వెనకబడిపోయింది. దీంతో ఆమెకు రాకరాక టాలీవుడ్లో ఓ సినిమా ఆఫర్ వచ్చి పడింది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కాగా ఈ సినిమాను ఇప్పటికే లాంఛ్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా షూటింగ్‌ను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ముంబై నుండి రకుల్ పాప శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిందని, అక్కడి నుండి నేరుగా వికారాబాద్ వెళ్లిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి అడవిలో షూటింగ్ కోసం గెంతుతూ వచ్చేసిన రకుల్‌ను ఆమె ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు క్రిష్ చేయబోతున్న సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి పవన్ సినిమాకు బ్రేక్ ఇచ్చి మరీ వైష్ణవ్ తేజ్‌తో సినిమా చేస్తున్న క్రిష్, ఈ కుర్రహీరోకు ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.