Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఆ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్ రానుందా..?

ఆ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్ రానుందా..?

Rakshasudu Sequel On Cards

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలకు సీక్వెల్ చిత్రాలు అంటూ వస్తున్నాయి. ఈ సినిమాల్లో సరైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు. ఇక కంటెంట్‌లో దమ్ములేని సినిమాలను నిర్మొహమాటంగా తిప్పికొడుతున్నారు. కాగా గతేడాది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన రాక్షసుడు చిత్రం ఎవ్వరి ఊహలకు అందకుండా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్‌లో తొలి కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

కాగా తమిళంలో వచ్చిన రాట్ససన్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సె్స్ అయ్యింది. ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో ఈ సినిమాకు సీక్వెల్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం దర్శకుడు రామ్ కుమార్ ఈ సినిమాకు సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో పడ్డాడట. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా పూర్తి చేసిన ఈ డైరెక్టర్, త్వరలోనే ఈ సినిమా నటీనటులను ఓకే చేసి చిత్రాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట.

మరి తమిళంలో లేని సీక్వెల్‌కు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. మరి ఈ సీక్వెల్ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారా లేదా అనేది చూడాలి. రాక్షసుడు చిత్రానికి సీక్వెల్‌గా రాబోయే సినిమా నిజంగానే పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad