విజయదేవరకొండ జాతీయస్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నహీరో. దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, నోటా, టాక్సీవాలా వంటి సినిమాలో నటించాడు. గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాల్లో తన సత్తాను చాటిన హీరో. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దేవరకొండ సోదరుడు కూడా సినీరంగంలోకి ‘దొరసాని’ సినిమాతో అరంగేట్రము చేస్తున్నాడు.
సురేష్ బాబు ప్రొడక్షన్ లో మహేంద్ర దర్శకత్వం వహించగా, యష్ రంగినేని నిర్మాణంలో విజయదేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా నటిస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ సరసన యాంగ్రీ యంగ్ మాన్ జీవితా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక నటించడం మరో విశేషం. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక వీరిద్దరూ దొరసాని సినిమాతోనే సినీరంగానికి పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సినిమా మొత్తం తెలంగాణ యాష, బాష కథాసారాంశాలతో సాగనుంది. ఈ సినిమా లో ఎక్కువ భాగం వరకు వరంగల్ , సిద్ధిపేటలలో చిత్రీకరించారు. ఇప్పటికే 90 శాతం వరకు సినిమా పూర్తయినట్లు సమాచారం.
దొరసాని సినిమా ఫస్టులుక్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టె దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను జీవితరాజశేఖర్ తో చేతులు మీదుగా మొదలుపెట్టాలని సన్నాహాలు సాగుతున్నాయి. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీ కాగా, ‘కల్కి’ సినిమా తో రాజశేఖర్ బిజీగా ఉన్నారు. వీరిద్దరికి సమయం దొరకగానే ప్రమోషన్స్ ప్రారంభించనున్నారట.