Home సినిమా గాసిప్స్ జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

images 2020 01 30T091348

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్ అభిమాన సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే నాడు టీజర్ వస్తుందని చాలా మంది విశ్వసించారు అయితే లాక్ డౌన్ కారణంగా చిత్రబృందం ఆనాడు టీజర్ ని విడుదల చేయలేదు. తర్వాత ఆగస్టు 15 నాడు ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని ఎదురు చూసినప్పటికీ మరోసారి నిరాశ ఎదురైంది. సినిమా మొదలై దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటి వరకు తారక్ కు సంభందించి ఏ ఒక్క అప్డేట్ విడుదలకాలేదు. పరిస్థితులు చూస్తూ ఉంటే రాజమౌళి, ఎన్టీఆర్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్ డౌన్ తర్వాత వెనువెంటనే సినిమా షూటింగ్ మొదలుపెట్టి, ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని తెలిపారు. మరో వైపు కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు షూటింగ్ మొదలు పెట్టమని మూవీ ప్రకటించింది. ఒకేసారి రెండు భిన్నమైన వాదనలు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ లో ఎన్టీఆర్ సంబంధించిన టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉంది. సినిమా షూటింగ్ ని అక్టోబర్ రెండో వారంలో మొదలు పెడుతున్నట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే టీజర్ కు సంబంధించిన విషయం పై రాజమౌళి చిత్ర బృందంతో చర్చించినట్లు తెలుస్తోంది.

అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువడనుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని జోరుగా ప్రచారం సాగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad