Home టాప్ స్టోరీస్ ప్లాస్మా దానం పై రాజమౌళి వివరణ

ప్లాస్మా దానం పై రాజమౌళి వివరణ

untitled 1

ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక ఆయుధం ప్లాస్మా ధేరిపి. సాధారణంగా శరీరంలోకి ఏదైనా ఒక వైరస్ వచ్చినప్పుడు ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి శరీరం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిరక్షకాలు చాలాకాలం పాటు మన శరీరంలో ఉంటాయి. శరీరంలో రక్తంతో పాటు ప్లాస్మా కూడా ఉంటుంది. ఇందులోనే తెల్లరక్తకణాలు మరియు ఇతర రక్త కణాలు ఉంటాయి. రక్త దానం చేసే సమయంలో వైద్యులు కేవలం రక్తాన్ని మాత్రమే మార్పిడి చేస్తారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఒక వ్యక్తిలోని ప్రతిరక్షక కణాలను మరో వ్యక్తిలోకి మార్పిడి చేసే నూతన విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు ఈ విధానాన్నే అవలంబిస్తున్నారు. ప్లాస్మా దానం చేయడం ద్వారా రోగులు వేగంగా కోలుకునే అవకాశం ఉంది. కానీ ఎక్కువ మంది ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావడం లేదు. తాజాగా టాలీవుడ్ దిగ్గజం దర్శకుడు రాజమౌళి అతని కుటుంబం కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో జక్కన్న ప్లాస్మా ధానం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. కరోనా నుండి కోలుకున్న తరువాత ప్లాస్మా ధానం చేస్తానని పత్రికా ముఖంగా ప్రకటన చేశారు. తాజాగా వారు కరోనా నుండి కోలుకున్నారు. అయితే తాను ప్లాస్మా ధానం చేయడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి ప్లాస్మా డొనేట్ చేయాలంటే ఇమ్యునోగ్లోబులిన్ జి యాంటీబాడీస్ 15 పాయింట్ల కంటే అధికంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాజమౌళి రక్తంలో igG లెవెల్స్ 8.62 మాత్రమే ఉన్నాయి. అందుకే వైద్యులు వారిని ప్లాస్మా డొనేట్ చేయవద్దని సూచించారని తెలుస్తోంది. అందుకే, తాను ప్లాస్మాను దానం చేయలేకపోతున్నానని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయినప్పటికీ రాజమౌళి కుటుంబ సభ్యులు మాత్రం ప్లాస్మా ధానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ప్లాస్మా దానం చేయగా వారి కుమారుడు కాల భైరవ కూడా మంగళవారం నాడు కిమ్స్ హాస్పిటల్‌లో ప్లాస్మా దానం చేశారు. తాను ప్లాస్మా డొనేట్ చేయనప్పటికీ ప్రజలందరూ ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని రాజమౌళి కోరారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad