
టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి కామెంట్ చేసేందుకు చాలా మంది ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఆయనపై నెగెటివ్ కామెంట్ చేసేందుకు ఇతరులకు పెద్దగా అవకాశం ఇవ్వడు బాలయ్య. దీంతో రాజకీయ పరంగా అయినా, సినిమా పరంగా అయినా బాలయ్య అంటే చాలా మందికి గౌరవం ఏర్పడింది. కాగా కొన్ని సందర్భాల్లో ఆయన వ్యవహరించే తీరును పలువురు తప్పుబట్టడం మనం చూశాం. కాగా తాజాగా బాలయ్య గురించి ప్రముఖ నటుడు, వైసీపీ మద్దతుదారైన రాజా రవీంద్ర కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన రాజా రవీంద్ర ఆ పార్టీ కోసం ప్రచారం చేశాడు. కాగా ఏపీ సీఎంగా జగన్ పాలనా తీరు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బాగుందని ఆయన అంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను రాజా రవీంద్ర వెల్లడించాడు. బాలయ్య ముక్కుసూటి వ్యక్తిగా మొత్తం ఇండస్ట్రీ జనాలకు తెలుసని ఆయన అన్నారు. మనసులో ఏది ఉంటే అది నిర్మొహమాటంగా మొహం మీద అనేసే వ్యక్తి బాలయ్య అని.. ప్రమిస్తే దగ్గరికి తీసుకోవడం, కోపం వస్తే కోపడటం.. బాలయ్యకు ఈ రెండే తెలుసని, మనసులో ఏమీ దాచుకోరని రాజా రవీంద్ర అన్నారు.
ఇక రాజకీయంగా కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని బాలయ్య ధీమా వ్యక్తం చేశారంటే, ఆయనకు దానికి సంబంధించిన అవగాహన ఖచ్చితంగా ఉండి ఉంటుందని రాజా రవీంద్ర అన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి బాలయ్య గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఏదేమైనా బాలయ్య ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసిందేనని ఆయన అభిమానులు అంటున్నారు.